SPORTS

సంజూ శాంస‌న్ ఫ్లాప్ షో

Share it with your family & friends

నిరాశ ప‌ర్చిన కెప్టెన్

చెన్నై – ఐపీఎల్ 2024లో కేర‌ళ స్టార్ సంజూ శాంస‌న్ సార‌థ్యంలోని రాజ‌స్థాన్ రాయ‌ల్స్ క‌థ కంచికి చేరింది. 17వ సీజ‌న్ లో ఫైన‌ల్ కు వెళ్లాల‌న్న ఆశ‌ల‌పై నీళ్లు చ‌ల్లింది ప్యాట్ క‌మిన్స్ సేన‌. తొలి సెష‌న్ లో వ‌రుస విజ‌యాల‌తో దుమ్ము రేపిన రాజ‌స్థాన్ రాయ‌ల్స్ రెండో సెష‌న్ లో ఆశించిన మేర రాణించ లేక పోయింది.

పాయింట్ల ప‌ట్టిక‌లో టాప్ లో కొన‌సాగుతూ వ‌చ్చిన ఆ జ‌ట్టు అనుకోకుండా సెకండ్ సెష‌న్ లో చేతులెత్తేసింది. చివ‌ర‌కు ప్లే ఆఫ్స్ లో ఎలిమినేట‌ర్ మ్యాచ్ ఆడాల్సి వ‌చ్చింది. కీల‌క మ్యాచ్ ల‌లో బాధ్య‌తా యుత‌మైన ఇన్నింగ్స్ ఆడాల్సిన కెప్టెన్ సంజూ శాంస‌న్ చేతులెత్తేశాడు. చెత్త షాట్స్ ఆడి త‌న వికెట్ల‌ను తానే స‌మ‌ర్పించుకున్నాడు.

టోర్నీలో తొలి ద‌శ‌లో దుమ్ము రేపిన శాంస‌న్ ఎందుకు త‌న ఫామ్ కోల్పోయాడో త‌న‌కే అర్థం కాని ప‌రిస్థితి. సీజ‌న్ మొత్తంలో 400 ర‌న్స్ కు పైగా చేసినా ఆశించిన మేర జ‌ట్టును ఫైన‌ల్ కు చేర్చ‌లేక పోయాడు. మొత్తంగా సంజూ శాంస‌న్ ప‌రిస్థితి రెంటికి చెడ్డ రేవ‌డిలా త‌యారైంది. త‌ను టి20 వ‌ర‌ల్డ్ క‌ప్ కు ఎంపిక‌య్యాడు.