ప్యాట్ కమిన్స్ కెప్టెన్సీ సూపర్
ఐపీఎల్ 2024లో సూపర్ షో
చెన్నై – గత ఐపీఎల్ సీజన్ లో ఆశించిన మేర రాణించ లేక పోయింది సన్ రైజర్స్ హైదరాబాద్. ఐపీఎల్ వేలం పాటలో భారీ ధరకు అమ్ముడు పోయాడు ఆసిస్ ప్లేయర్ ప్యాట్ కమిన్స్. ఆల్ రౌండర్ గా పేరు పొందిన ఈ ఆసిస్ క్రికెటర్ పై ఇన్ని డబ్బులు ఎందుకు ఖర్చు చేశారంటూ పెద్ద ఎత్తున ప్రశ్నల వర్షం కురిసింది. కానీ సన్ రైజర్స్ జట్టు యజమాని , సిఈవో కావ్య మారన్ ఎవరినీ లెక్క చేయలేదు. తనపై పూర్తి నమ్మకాన్ని పెట్టుకుంది.
కావ్య పాప అంచనాలు తప్ప లేదు. తాను పెట్టిన ధరకు అనుగుణంగా అద్భుతంగా రాణించాడు. తను ఆడుతూ తన జట్టును అంచనాలకు మించి గెలుపు సాధించడంలో కెప్టెన్ గా సక్సెస్ అయ్యాడు ప్యాట్ కమిన్స్.
ప్రధానంగా ఐపీఎల్ లో బలమైన జట్లకు చుక్కలు చూపించింది సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు. వారెవ్వా అనే రీతిలో ఆకట్టుకుంది. అటు బ్యాటింగ్ లో అరివీరమైన భయంకర ఇన్నింగ్స్ తో ఆడింది. ప్రత్యర్థుల జట్లకు చుక్కలు చూపించింది. ఇక బౌలింగ్ గురించి ఎంత చెప్పినా తక్కువే. మొత్తంగా ప్యాట్ కమిన్స్ కెప్టెన్సీ సూపర్ అనేది తేలి పోయింది. రేపు కప్ గెలిచినా ఆశ్చర్య పోవాల్సిన పని లేదు.