కావ్య మారన్ కళ కళ
సన్ రైజర్స్ సూపర్ షో
చెన్నై – ఐపీఎల్ 2024లో సూపర్ షో ప్రదర్శించింది ప్యాట్ కమిన్స్ సారథ్యంలోని సన్ రైజర్స్ హైదరాబాద్. 17వ సీజన్ లో ఆ జట్టు గెలుపు సాధిస్తూ ప్రత్యర్థి జట్లకు చుక్కలు చూపించింది. అటు బ్యాటింగ్ లో ఇటు బౌలింగ్ లో అద్భుతమైన ఆట తీరును ప్రదర్శించి దుమ్ము రేపింది.
తొలి సెషన్ నుంచి వరుస విజయాలతో విస్తు పోయేలా చేసింది సెకండ్ సీజన్ లో సైతం గెలుపు సాధిస్తూ తనకు ఎదురే లేదని చాటింది. మరో వైపు కోల్ కతా నైట్ రైడర్స్ జట్టు సైతం సూపర్ షో తో ఆకట్టుకుంది. నేరుగా ఐపీఎల్ 2024లో ఫైనల్ కు చేరింది.
ఈనెల 26న ఆదివారం కోల్ కతా లోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా ఫైనల్ మ్యాచ్ కు సిద్దమైంది సన్ రైజర్స్ హైదరాబాద్ . భారీ ధరకు కొనుగోలు చేసింది జట్టు యజమాని , చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (సీఇఓ ) కావ్య మారన్.
తమ మీద పెట్టుకున్న అంచనాలను తలకిందులు చేస్తూ హైదరాబాద్ గ్రాండ్ విక్టరీ నమోదు చేసింది. బలమైన రాజస్థాన్ రాయల్స్ జట్టుకు షాక్ ఇచ్చి నేరుగా ఫైనల్ కు చేరింది. క్వాలిఫయర్ 2లో సూపర్ షో తో ఆకట్టుకుంది. మొత్తంగా కావ్య మారన్ తెగ సంతోషానికి లోనైంది. సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా నిలిచింది. సోషల్ మీడియాలో హల్ చల్ చేసింది.