తేజస్వి యాదవ్ వన్ మ్యాన్ ఆర్మీ
ప్రచారంలో డిప్యూటీ సీఎం ముందంజ
బీహార్ – పార్లమెంట్ ఎన్నికలలో దేశ వ్యాప్తంగా సంచలనంగా మారారు ఒకే ఒక్కడు బీహార్ కు చెందిన మాజీ డిప్యూటీ సీఎం తేజస్వి యాదవ్. ఆయనను ప్రస్తుతం అంతా వన్ మ్యాన్ ఆర్మీ అంటున్నారు. దీనికి ప్రధాన కారణం తను సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా మారాడు . తనను మోసం చేసి తిరిగి బీజేపీ గూటికి చేరిన సీఎం నితీశ్ కుమార్ కు చుక్కలు చూపిస్తున్నాడు.
ఓ వైపు శరీరం సహకరించక పోయినా ఒంటరి పోరాటం చేస్తూ అందరినీ విస్తు పోయేలా చేస్తున్నాడు. ఎలాగైనా సరే నితీశ్ , నరేంద్ర మోడీ పరివారానికి కోలుకోలేని రీతిలో షాక్ ఇవ్వాలని అలుపెరుగని రీతిలో శ్రమిస్తున్నాడు. తానే అన్నీ అయి ముందుకు నడుస్తున్నాడు. పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నాడు.
వెన్ను నొప్పితో నడవ లేక పోతున్నా ఎక్కడా తగ్గడం లేదు. సహాయకుల సాయంతో ముందుకు కదులుతున్నాడు. తనకు ఎదురే లేదని చాటే ప్రయత్నం చేస్తున్నాడు తేజస్వి యాదవ్. విచిత్రం ఏమిటంటే ప్రచారం చేసేందుకు గాను ప్రతి రోజూ 2 ఇంజక్షన్లు తీసుకుంటున్నాడు. ఒక రకంగా తేజస్వి పట్టుదల ముందు ప్రభుత్వం చిన్న బోవడం విశేషం కదూ.