రాష్ట్రంలో భట్టి..రేవంత్..ఉత్తమ్ ట్యాక్స్
సంచలన ఆరోపణలు చేసిన కేటీఆర్
హైదరాబాద్ – కాంగ్రెస్ సర్కార్ పై తీవ్ర స్థాయిలో ఆరోపణలు గుప్పించారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ , మాజీ మంత్రి కేటీఆర్. ఎమ్మెల్సీ ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన బీఆర్ఎస్ తరపున బరిలో నిలిచిన రాకేశ్ రెడ్డి తరపున ప్రచారం చేశారు. ఈ సందర్బంగా మంత్రులు భట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డితో పాటు సీఎం రేవంత్ రెడ్డిపై విమర్శలు గుప్పించారు.
నిన్నటి దాకా రేవంత్ రెడ్డి పేరుతో అనధికారికంగా పన్నులు వసూలు చేశారని ఇప్పుడు ఆయనకు తోడుగా మరో ఇద్దరు జత కూడారని ఆరోపించారు కేటీఆర్. రాష్ట్రంలో నూతనంగా బీఆర్యూ ట్యాక్స్ కు శ్రీకారం చుట్టారంటూ మండిపడ్డారు.
బీఆర్యయూ అంటే భట్టి విక్రమార్క, రేవంత్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి పేరుతో పరోక్షంగా పన్నులను ప్రారంభించారని, ఇవన్నీ వసూలు దందాకు తెర లేపారంటూ ధ్వజమెత్తారు కేటీఆర్. వసూలు చేసిన డబ్బు సంచులను ఢిల్లీకి పంపించడంలో వీరంతా నిమగ్నమై ఉన్నారంటూ ఫైర్ అయ్యారు.
వీరి బాధ తట్టుకోలేక జనం బెంబేలెత్తి పోతున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశారు కేటీఆర్.