ఓటేసిన రాహుల్ ..సోనియా గాంధీ
ప్రజాస్వామానికి ఓటు మూలాధారం
న్యూఢిల్లీ – సార్వత్రిక ఎన్నికలలో భాగంగా 6వ విడత పోలింగ్ లో భాగంగా శనివారం న్యూఢిల్లీలో ఏఐసీసీ మాజీ చీఫ్ లు రాహుల్ గాంధీ, సోనియా గాంధీ తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. గత 50 రోజులుగా వారంతా కాళ్లకు బలపం కట్టుకుని ప్రచారం చేశారు. ప్రధానంగా రాహుల్ గాంధీ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా మారారు. ఆయన చేపట్టిన భారత్ జోడో యాత్ర దేశాన్ని ఒక కుదుపు కుదిపేసింది. గత 10 ఏళ్లుగా దేశాన్ని ఏక ఛత్రాధిపత్యంగా ఏళుతున్న నరేంద్ర మోడీకి ముచ్చెమటలు పట్టించారు.
రాహుల్ గాంధీకి పెరుగుతున్న ఆదరణను చూసి భారతీయ జనతా పార్టీ, దాని పరివారం బెంబెలెత్తి పోయింది. ఈ తరుణంలో జరుగుతున్న పార్లమెంట్ ఎన్నికలు న్యాయానికి, ధర్మానికి అవినీతికి, ఆశ్రిత పక్ష పాతానికి, పెట్టుబడిదారులకు పేదలకు మధ్య జరుగుతున్న యుద్దంగా అభివర్ణించారు రాహుల్ గాంధీ.
తమ కూటమిని ఆదరించాలని కోరారు . ఆరు నూరైనా సరే తాము అధికారంలోకి రావడం ఖాయమని అన్నారు . దేశంలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను దశల వారీగా భర్తీ చేస్తామని ప్రకటించారు. పేద కుటుంబాలకు చెందిన మహిళల ఖాతాల్లోకి నెలకు రూ. 8,500 చొప్పున సాయం చేస్తామని హామీ ఇచ్చారు రాహుల్ గాంధీ. మొత్తంగా ప్రజాస్వామ్య దేశంలో ఓటు కీలకమని, ప్రాధాన్యత కలిగి ఉంటుందన్నారు.