NEWSNATIONAL

ముస్లింల రిజ‌ర్వేష‌న్ల‌పై విచార‌ణ

Share it with your family & friends

ఆదేశించిన యూపీ సీఎం యోగి

ఉత్త‌ర ప్ర‌దేశ్ – రాష్ట్ర ముఖ్య‌మంత్రి యోగి ఆదిత్యానాథ్ సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశారు. ఆయ‌న ముస్లింల‌కు అమ‌లు చేస్తున్న రిజ‌ర్వేష‌న్ల‌పై కీల‌క వ్యాఖ్య‌లు చేయ‌డం ప్రాధాన్య‌త సంత‌రించుకుంది. శ‌నివారం యోగి ఆదిత్యానాథ్ మీడియాతో మాట్లాడారు.

రాష్ట్రంలో గ‌త ప్ర‌భుత్వాల హ‌యాంలో ముస్లింల‌కు ఇచ్చిన ఓబీసీ రిజ‌ర్వేష‌న్ల‌పై తిరిగి మ‌రోసారి స‌మీక్షించ‌నున్న‌ట్లు ప్ర‌క‌టించారు. ఆయ‌న చేసిన కీల‌క ప్ర‌క‌ట‌న క‌ల‌క‌లం రేపుతోంది రాష్ట్రంలో. ముస్లింల‌కు ఓబీసీ కేట‌గిరిని ఎలా వ‌ర్తింప చేశార‌ని, ఏ ప్రాతిప‌దిక‌న అమ‌లు చేయాల్సి వ‌చ్చింద‌నే దానిపై విచార‌ణ చేప‌ట్ట‌నున్న‌ట్లు తెలిపారు.

విచార‌ణ‌లో భాగంగా ఇప్ప‌టి వ‌ర‌కు జారీ చేసిన పాత పాత్ర‌ల‌ను అన్నింటిని జ‌ల్లెడ ప‌డుతున్నారు. యూపీలో ఓబీసీ కోటా కింద 24కు పైగా కులాల‌తో పాటు ముస్లింలు కూడా ఓబీసీ కింద రిజ‌ర్వేష‌న్లు పొందుతున్నారు.

దీనిపై ఆరా తీయాల‌ని ఆదేశించారు యోగి ఆదిత్యానాథ్‌. ఇదిలా ఉండ‌గా తాజాగా కోల్ క‌తా కోర్టు సంచ‌ల‌న తీర్పు ఇచ్చింది. ప‌శ్చిమ బెంగాల్ లో 2010 నుండి జారీ చేసిన అన్ని ఓబీసీ స‌ర్టిఫికెట్లు చ‌ట్ట విరుద్ద‌మ‌ని పేర్కొంది. ఈ నేప‌థ్యంలో యూపీలో కూడా జారీ చేసిన ప‌త్రాల‌పై విచార‌ణ ప్రారంభ‌మైంది.