చాన్స్ ఇస్తే జాబ్స్ ఇస్తాం – తేజస్వి
మాజీ డిప్యూటీ సీఎం కామెంట్స్
బీహార్ – ప్రభుత్వ రంగంలో ఉద్యోగాల కల్పన అన్నది ఓ సమస్య కానే కాదని స్పష్టం చేశారు బీహార్ మాజీ డిప్యూటీ సీఎం తేజస్వి యాదవ్. ఆయన తన హయాంలో చెప్పిన మాట ప్రకారం నిలబడ్డారు. వేలాది మందికి ఉద్యోగాలు కల్పించారు.
జాతీయ మీడియా ఛానల్ తో ఆయన సంభాషించారు. రాహుల్ కన్వాల్ అడిగిన ప్రశ్నకు ఆయన ధీటుగా సమాధానం ఇచ్చారు. ప్రధాన మంత్రి ఈ పదేళ్ల కాలంలో టైమ్ వేస్ట్ చేశారని మండిపడ్డారు. ఆయనకు జాబ్స్ ఇవ్వాలన్న చిత్తశుద్ది లేదన్నారు. కేవలం ఉన్న ఉద్యోగాలను ఎలా లేకుండా చేయాలనే దానిపై ఫోకస్ పెట్టారంటూ పేర్కొన్నారు.
ప్రతిపక్షాలతో కూడిన భారత కూటమిని ముందుగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనీయండి. ఎలా జాబ్స్ భర్తీ చేయాలో చేసి చూపిస్తామని సవాల్ విసిరారు. తాము ఏది చెప్పామో బీహార్ లో చేసి చూపించామని, ఇది అక్షరాల వాస్తవమని పేర్కొన్నారు.
జాబ్స్ భర్తీ చేయడం అన్నది కేవలం సెకన్లలో పని అని పేర్కొన్నారు తేజస్వి యాదవ్. ఆయన చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం ప్రాధాన్యత సంతరించుకున్నాయి.