ఓటు వేయండి జాబ్స్ తీసుకోండి
తేజస్వి యాదవ్ కీలక కామెంట్స్
బీహార్ – మాజీ డిప్యూటీ సీఎం తేజస్వి యాదవ్ కీలక వ్యాఖ్యలు చేశారు. మీ విలువైన ఓట్లను తమకు వేయాలని, తాము పవర్ లోకి వచ్చాక మీ అందరికీ జాబ్స్ ఇచ్చే పూచీ నాది అంటూ ప్రకటించారు. పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో బాగంగా ఆయన ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు.
బీహార్ లో నితీశ్ కుమార్ తో కలిసి ఏర్పాటు చేసిన ప్రభుత్వంలో తేజస్వి యాదవ్ డిప్యూటీ సీఎంగా పని చేశారు. ఆయన సర్కార్ లో కీలకమైన వ్యక్తిగా ఉన్నారు. ఎక్కడ ఖాళీలు ఉన్నాయో వాటిని భర్తీ చేసే పనిలో పడ్డారు. చివరకు తేజస్వి యాదవ్ సక్సెస్ అయ్యారు.
ఆయన తీసుకున్న నిర్ణయం దేశాన్ని తన వైపు తిప్పుకునేలా చేసింది. ఇదే విషయాన్ని పదే పదే ప్రస్తావిస్తూ వచ్చారు ఏఐసీసీ మాజీ చీఫ్ రాహుల్ గాంధీ. భారత కూటమి తరపున కాంగ్రెస్ పార్టీతో లాలూ ప్రసాద్ యాదవ్ పార్టీ కూడా కీలక పాత్ర పోషిస్తోంది.
ప్రస్తుతం తేజస్వి యాదవ్ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా మారారు. ఆయన తీసుకున్న నిర్ణయాలకు రాహుల్ గాంధీ ఫిదా అయ్యారు.