ఓటు వేసిన మిరయా వాద్రా
ఢిల్లీలో 6వ విడత పోలింగ్
న్యూఢిల్లీ – ఎవరీ మిరయా వాద్రా అనుకుంటున్నారు. సోనియా గాంధీ కూతురు ప్రియాంక గాంధీ, రాబర్ట్ వాద్రా ముద్దుల తనయ మిరయా వాద్రా . తను ఇవాళ దేశ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారారు. న్యూఢిల్లీలో శనివారం 6వ విడత పోలింగ్ కొనసాగుతోంది. ఇందులో భాగంగా ఇవాళ ఏఐసీసీ మాజీ చీఫ్ రాహుల్ గాంధీ, సీపీపీ చైర్ పర్సన్ సోనియా గాంధీ, కూతురు ప్రియాంక గాంధీ తమ విలువైన ఓటు హక్కు వినియోగించుకున్నారు.
ఈ సందర్బంగా ఆమె జాతీయ మీడియాతో మాట్లాడారు. ఈ ఎన్నికల్లో ప్రతి ఒక్కరు తమ ఓటు హక్కు వినియోగించు కోవాలని కోరారు. ఇది తాను ఇచ్చే ఏకైక సందేశం అని పేర్కొన్నారు. దేశ భవిష్యత్తు కోసం మనందరం ఓటు వేయాలన్నారు.
ఇంట్లో కూర్చోవడం వల్ల దేశం ఎలా బాగు పడుతుందని ప్రశ్నించారు. మెరుగైన సమాజం కోసం , దేశ భవిష్యత్తు కోసం ఓటు వేసేందుకు ముందుకు రావాలని ఢిల్లీ వాసులకు విజ్ఞప్తి చేశారు మిరయా వాద్రా. ప్రస్తుతం మిరయా వాద్రా నెట్టింట్లో హల్ చల్ చేస్తోంది.