NEWSNATIONAL

ఓటు ప్ర‌జాస్వామ్యానికి మూలం

Share it with your family & friends

సీఎం అర‌వింద్ కేజ్రీవాల్ కామెంట్

న్యూఢిల్లీ – ప్ర‌జాస్వామ్యం మ‌నుగ‌డ సాధించాలంటే ఓటు అనే ఆయుధం అత్యంత ముఖ్య‌మైన పాత్ర పోషిస్తుంద‌ని అన్నారు ఆప్ చీఫ్ , ఢిల్లీ ముఖ్య‌మంత్రి అర‌వింద్ కేజ్రీవాల్. సార్వ‌త్రిక ఎన్నిక‌ల‌లో భాగంగా ఢిల్లీలో 6వ విడ‌త పోలింగ్ శ‌నివారం కొన‌సాగుతోంది. ఈ సంద‌ర్బంగా వివిధ రాజ‌కీయ పార్టీల‌కు చెందిన ప్ర‌ముఖ నాయ‌కులు త‌మ ఓటు హ‌క్కు వినియోగించుకున్నారు. ఈ సంద‌ర్బంగా ప్ర‌తి ఒక్క‌రు ఓటు వినియోగించు కోవాల‌ని కోరారు.

తాజాగా అరవింద్ కేజ్రీవాల్ త‌న ఓటుతో పాటు త‌న కుటుంబంతో క‌లిసి ఓటు వేశారు. ఆయ‌న ప్ర‌స్తుతం మ‌ధ్యంత‌ర బెయిల్ పై ఉన్నారు. ప్ర‌స్తుతం ఢిల్లీ లిక్క‌ర్ స్కామ్ కేసులో తీవ్ర ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటున్నారు.

ఓటు వేసిన అనంత‌రం కేజ్రీవాల్ మీడియాతో మాట్లాడారు. ప్ర‌జ‌లు మార్పు కోరుకుంటున్నార‌ని అన్నారు. ఇంకొన్ని రోజుల‌లో ఎవ‌రు ఏమిటి అనేది తేల బోతోంద‌న్నారు. త‌న‌ను జైలుపాలు చేసి ఢిల్లీలో ఆప్ స‌ర్కార్ ను కూల్చాల‌ని ప్ర‌ధాని మోడీ, అమిత్ షా కుట్ర పన్నార‌ని ఆరోపించారు. వారి కుట్ర‌లు, కుతంత్రాలు సాగ లేద‌న్నారు.