హార్దిక్ పాండ్యాకు భార్య బిగ్ షాక్
మరో వ్యక్తితో కలిసి వీధుల్లోకి
ముంబై – ప్రముఖ క్రికెటర్, ముంబై ఇండియన్స్ స్కిప్పర్ హార్దిక్ పాండ్యాకు భార్య , సెర్బియా మోడల్ నటాషా స్టాంకోవిక్ మధ్య దూరం పెరిగిందా. అవుననే అంటున్నాయి విశ్వసనీయ వర్గాలు. తను క్రికెటర్ గా ఇప్పటికే పేరు పొందారు. ప్రస్తుతం ఐపీఎల్ లో ఘోరంగా వైఫల్యం చెందింది తన జట్టు. కెప్టెన్ గా, క్రికెటర్ గా రాణించ లేక పోయాడు హార్దిక్ పాండ్యా.
మితి మీరిన ఆత్మ విశ్వాషానికి తోడు అహంకార పూరితమైన ధోరణి హార్దిక్ పాండ్యాపై మరింత విమర్శలు ఎక్కు పెట్టేలా చేసింది. తన వ్యవహారం సోషల్ మీడియా వేదికగా చర్చనీయాంశంగా మారింది. ఉన్నట్టుండి నటాషా స్టాంకోవిక్ ను గతంలో పెళ్లి చేసుకున్నాడు.
తాజాగా వీరిద్దరి మధ్య విభేదాలు పొడ సూపాయని, త్వరలోనే విడి పోతున్నట్లు పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో చర్చోప చర్చలు కొనసాగాయి. దీనికి ఊతం ఇస్తూ నటాషా స్టాంకోవిక్ తన స్నేహితుడు అలెజ్గాండర్ అలెక్స్ ఇలిక్ తో కలిసి కనిపించింది. దీనిపై మీడియా అడిగిన ప్రశ్నకు ఎలాంటి సమాధానం ఇవ్వక పోవడం గమనార్హం.