కమిన్స్ సేన షాక్ ఇచ్చేనా
ఐపీఎల్ 2024 ఫైనల్ పోరు
చెపాక్ – ఇండియన్ ప్రిమీయర్ లీగ్ 2024 టోర్నీ ఆఖరి అంకానికి చేరుకుంది. నువ్వా నేనా అన్న రీతిలో పోటీ కొనసాగనుంది. కోల్ కతా నైట్ రైడర్స్ తో ఆసిస్ క్రికెట్ దిగ్గజం ప్యాట్ కమిన్స్ సారథ్యంలోని సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు అంచనాలకు మించి ఆడుతోంది. అద్బుతమైన ఆట తీరుతో ప్రత్యర్థుల జట్లకు చుక్కలు చూపిస్తూ ఫైనల్ కు చేరుకుంది.
అటు బ్యాటింగ్ లో ఇటు బౌలింగ్ , ఫీల్డింగ్ లో సూపర్ షో ప్రదర్శిస్తూ విస్తు పోయేలా చేసింది. ప్రధానంగా కమిన్స్ కెప్టెన్సీ ఎస్ ఆర్ హెచ్ కు వరంగా మారింది. ఇక ఆటగాళ్ల పరంగా చూస్తే ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ, నితీశ్ కుమార్ రెడ్డి..ఇలా చెప్పుకుంటూ పోతే ప్రతి క్రికెటర్ తమ జట్టు కోసం ఎంతటి దాకా అయినా సరే తెగించి ఆడేందుకు సిద్దంగా ఉన్నారు.
దీంతో కోల్ కతా నైట్ రైడర్స్ కు చుక్కలు చూపించడం ఖాయమని తేలి పోయింది. చివరి బంతి వరకు ఉత్కంఠ భరితంగా ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ కొనసాగడం తప్పదని క్రికెట్ విశ్లేషకులు పేర్కొంటున్నారు. మొత్తంగా