SPORTS

కోల్ కతా జోరు సాగేనా

Share it with your family & friends

ఫైన‌ల్ పోరుకు కేకేఆర్ సిద్దం
చెపాక్ – ఐపీఎల్ 2024 లీగ్ చివ‌రి ద‌శ‌కు చేరుకుంది. 10 జ‌ట్ల‌లో రెండు జ‌ట్లు ఫైన‌ల్ కు చేరుకున్నాయి. ఆదివారం చెపాక్ స్టేడియం వేదిక‌గా కోల్ క‌తా నైట్ రైడ‌ర్స్ స‌న్ రైజ‌ర్స్ హైద‌రాబాద్ జ‌ట్టుతో త‌ల ప‌డ‌నుంది. ఇరు జ‌ట్లు అన్ని విభాగాల‌లో బ‌లంగా ఉన్నాయి. కోల్ క‌తా అద్భుతంగా రాణించింది. ప్ర‌త్య‌ర్థుల జ‌ట్ల‌కు చుక్క‌లు చూపిస్తోంది.

అటు బ్యాటింగ్ లో ఇటు బౌలింగ్ లో త‌న‌కు ఎదురే లేని రీతిలో ఆడుతూ వ‌స్తోంది. మొత్తంగా ఆ జ‌ట్టు ఎలాగైనా స‌రే ఐపీఎల్ క‌ప్ ను ఎగ‌రేసుకు పోవాల‌ని ప‌ట్టుద‌ల‌తో ఉంది. ప్ర‌ధానంగా కేకేఆర్ జ‌ట్టుకు హెడ్ కోచ్ గా గౌతం గంభీర్ ఉన్నాడు. త‌ను వ‌చ్చాక ఆ జ‌ట్టు ఆట తీరును పూర్తిగా మార్చేశాడు.

ఏ స‌మ‌యంలోనైనా స‌రే ఒత్తిళ్ల‌కు త‌ట్టుకుని నిల‌బ‌డ‌డం, జ‌ట్టు గెలిచేంత దాకా వేచి ఉండ‌డం నేర్పాడు. దీంతో బ్యాటింగ్ కు దిగితే ప‌రుగుల వర‌ద పారిస్తున్నారు. ఒక‌వేళ టార్గెట్ నిర్దేశిస్తే ఆడుతూ పాడుతూ అందుకుంటున్నారు. ఇక ప్ర‌త్య‌ర్థి జ‌ట్టును త‌మ అద్భుత‌మైన బౌలింగ్ తో బెంబేలెత్తిస్తున్నారు.

ఇవాళ ఐపీఎల్ క‌ప్ ఎవ‌రి స్వంతం అవుతుందో వేచి చూడాలి.