హైదరాబాద్ సారథి గెలుపుకు వారధి
ప్యాట్ కమిన్సా మజాకా అంటున్న ఫ్యాన్స్
చెన్నై – ఐపీఎల్ 2024 బిగ్ లీగ్ లో సంచలనంగా మారారు ఆస్ట్రేలియాకు చెందిన క్రికెటర్ ప్యాట్ కమిన్స్. తనను అత్యధిక ధరకు రూ. 20 కోట్లకు పైగా కొనుగోలు చేసింది 2023లో జరిగిన వేలం పాటలో సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు యాజమాన్యం. అందరూ గేలి చేశారు జట్టు సిఇఓ కావ్య మారన్ ను. కొందరైతే ఇంత డబ్బులు ఎందుకు పెట్టారంటూ ప్రశ్నించారు కూడా.
కానీ ఐపీఎల్ 17వ సీజన్ ప్రారంభం కావడంతో ప్యాట్ కమిన్స్ సత్తా ఏమిటో తెలిసొచ్చింది. తను ప్రధానంగా బౌలర్ . అంతే కాదు ఆల్ రౌండర్ కూడా. ఆస్ట్రేలియా జట్టు అంటేనే ప్రొఫెషనలిజంకు పెట్టింది పేరు. గతంలో సన్ రైజర్స్ జట్టుకు ఇదే ఆసిస్ కు చెందిన క్రికెటర్ సారథ్యం వహించాడు. టీమ్ ను ఐపీఎల్ విజేతగా నిలిచేలా చేశాడు.
మొత్తంగా టోర్నీలో సూపర్ షో ప్రదర్శించింది. ఏకంగా ఫైనల్ కు చేర్చేలా చేయడంలో కీలక పాత్ర పోషించాడు. కెప్టెన్ గా తను ఆడడమే కాకుండా ఇతర జట్టు సభ్యులను కూడా ఆడేలా చేశాడు. ఆదివారం ఐపీఎల్ 2024 ఫైనల్ కు వేదిక కానుంది చెన్నై లోని చెపాక్ స్టేడియం.