కావ్య పాప కళకళ లాడేనా
హైదరాబాద్ కప్ గెలిచేనా
తమిళనాడు – సన్ టీవీ యమాని దయానిధి మారన్ కూతురు , వేల కోట్ల ఆస్తులకు , సంపదకు వారసురాలిగా పేరు పొందారు కావ్య మారన్. తను ఎంబీఏ చేశారు. ప్రస్తుతం అన్నింటిని తను చూసుకుంటున్నారు.
ఎప్పుడైతే కావ్య మారన్ సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టును కొనుగోలు చేసిందో ఆనాటి నుంచి ప్రతి ఐపీఎల్ సీజన్ లో తను సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా మారారు. ఒక రకంగా చెప్పాలంటే సోషల్ మీడియాను షేక్ చేస్తూ వస్తున్నారు. కోట్లాది మంది కావ్య మారన్ కు ఫ్యాన్స్ అయ్యారు.
కావ్య మారన్ కు సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం నెట్టింట్లో హల్ చల్ చేస్తున్నాయి. క్వాలిఫయర్ -2 మ్యాచ్ సందర్బంగా జరిగిన కీలక పోరులో హైదరాబాద్ జట్టు భారీ తేడాతో బలమైన రాజస్థాన్ రాయల్స్ జట్టును ఓడించింది. ఈ సందర్బంగా తను చిన్న పిల్లలా ఎగిరి గంతేసింది. తన తండ్రిని ఆలింగనం చేసుకుని ఆనందం వ్యక్తం చేసింది.
ప్రస్తుతం తన స్వంత ప్రాంతం చెన్నై లోని చెపాక్ స్టేడియంలో ఆదివారం ఐపీఎల్ ఫైనల్ లో తన జట్టు తల పడనుంది. దీంతో అందరి కళ్లు మరోసారి కావ్య మారన్ పై పడ్డాయి. గెలిస్తే పాప నవ్వుతుంది. లేక పోయినా తను వైరల్ కావడం ఖాయం.