అగ్ని ప్రమాదం రాహుల్ సంతాపం
బాధితులకు కార్యకర్తలు సేవలు అందించాలి
న్యూఢిల్లీ – ఏఐసీసీ మాజీ చీఫ్ , రాయ్ బరేలి ఎంపీ అభ్యర్థి రాహుల్ గాంధీ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఇవాళ గుజరాత్ రాష్ట్రంలోని రాజ్ కోట్ లో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఓ మాల్ లోని గేమింగ్ జోన్ లో చోటు చేసుకున్న ప్రమాదం పలువురు చిన్నారుల ప్రాణాలు కోల్పోయేలా చేసింది. ఈ ఘటనతో ఒక్కసారిగా విషాదం అలుముకుంది. అంతటా నిశ్శబ్ద వాతావరణం చోటు చేసుకుంది.
ఈ ఘటనపై పలువురు ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. దేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ, కేంద్ర మంత్రి అమిత్ షా తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్త పరిచారు. ఇదిలా ఉండగా ఆదివారం ఘటనకు సంబంధించి కీలక వ్యాఖ్యలు చేశారు రాహుల్ గాంధీ.
ఈ ఘోరమైన అగ్ని ప్రమాదపు ఘటనలో అమాయక చిన్నారులు సహా పలువురు మృతి చెందడంపై తీవ్ర ఆవేదన చెందారు. మృతుల కుటుంబాలందరికీ తను ప్రగాఢ సానుభూతిని తెలియ చేస్తున్నట్లు స్పష్ట చేశారు ఏఐసీసీ మాజీ చీఫ్. గాయపడిన వారంతా వీలైనంత త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు.
కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకులు, కార్యకర్తలు వెంటనే సహాయక చర్యలలో పాల్గొనాలని రాహుల్ గాంధీ సూచించారు.