భారత కూటమిదే గెలుపు
ఢిల్లీలో భారీ పోలింగ్
న్యూఢిల్లీ – సార్వత్రిక ఎన్నికలలో భాగంగా 6వ విడత పోలింగ్ ముగిసింది. భారీ ఎత్తున పోలింగ్ జరగడం విశేషం. ఇదంతా ప్రభుత్వ పనితీరును తెలియ చేస్తుందని ఆమ్ ఆద్మీ పార్టీ పేర్కొంటోంది. ఈసారి ఎన్నికల్లో అనూహ్యంగా ప్రతిపక్షాలన్నీ కలిసి భారత కూటమిగా ఏర్పడ్డాయి. ఒంటరి పోరాటం చేస్తున్నాయి. ఎలాగైనా సరే భారతీయ జనతా పార్టీ కూటమిని ఓడించాలని కంకణం కట్టుకున్నాయి.
ఇదిలా ఉండగా ఈసారి ఈశాన్య ఢిల్లీ నుంచి ఇండియా కూటమి తరపున ప్రముఖ యువ నాయకుడు కన్హయ్య కుమార్ ఎంపీగా బరిలో నిలిచారు. ఆయనకు మద్దతుగా ఆప్ విస్తృతంగా ప్రచారం చేపట్టింది. ఆశించిన దానికంటే పోలింగ్ జరగడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు కన్హయ్య కుమార్.
ఓటు వేసిన అనంతరం కూటమి అభ్యర్థి మీడియాతో మాట్లాడారు. గతంలో కంటే ఎక్కువగా పోలింగ్ జరగడం, ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించు కోవడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. ఇది అసలైన ప్రజాస్వామ్యానికి బలం చేకూర్చేలా చేస్తుందన్నారు.