NEWSANDHRA PRADESH

జూన్ 9న సీఎంగా జ‌గ‌న్ ప్ర‌మాణం

Share it with your family & friends

స్ప‌ష్టం చేసిన మంత్రి బొత్స

విశాఖ‌ప‌ట్ట‌ణం – ఏపీ విద్యా శాఖ మంత్రి బొత్స స‌త్య నారాయ‌ణ కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. వైసీపీ మ‌రోసారి అధికారంలోకి రావ‌డం ఖాయ‌మ‌ని జోష్యం చెప్పారు. ఆదివారం ఆయ‌న మీడియాతో మాట్లాడారు. ఈ మేర‌కు త‌మ పార్టీ అధినాయ‌కుడు , సీఎం జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ముచ్చ‌ట‌గా రెండ‌వసారి ముఖ్య‌మంత్రిగా ప్ర‌మాణ స్వీకారం చేయ‌నున్నార‌ని జోష్యం చెప్పారు. ఇందులో ఎలాంటి అనుమానం అక్క‌ర్లేద‌న్నారు.

త‌మ పార్టీకి 175 అసెంబ్లీ స్థానాల‌కు గాను 150కి పైగా సీట్లు వ‌స్తాయ‌ని స్ప‌ష్టం చేశారు. ఇక 25 ఎంపీ స్థానాల‌కు గాను 20 కి పైగా సీట్లు ద‌క్క‌డం ఖాయ‌మ‌న్నారు బొత్స స‌త్య‌నారాయ‌ణ‌. ఇప్ప‌టికే త‌మ పార్టీ ప్ర‌మాణ స్వీకారం గురించి చ‌ర్చించ‌డం జ‌రిగింద‌న్నారు.

పార్టీ తీర్మానం చేసింద‌ని, ఈ మేర‌కు తేదీ కూడా ఖ‌రారు చేసింద‌న్నారు. ఇందుకు సంబంధించి వ‌చ్చే నెల జూన్ 9వ తేదీ ఉద‌యం 9. 18 గంట‌ల‌కు ముహూర్తం కూడా ఖ‌రారు చేయ‌డం జ‌రిగింద‌ని తెలిపారు విద్యా శాఖ మంత్రి.