కోల్ కతా దెబ్బ హైదరాబాద్ అబ్బా
ఐపీఎల్ 2024 ఫైనల్ లో ఘోర పరాజయం
చెన్నై – ఐపీఎల్ 2024 టోర్నీలో అత్యంత పేలవమైన ప్రదర్శనతో తీవ్ర నిరాశకు గురి చేసింది సన్ రైజర్స్ హైదరాబాద్. 17వ లీగ్ సీజన్ లో ఎవరూ ఊహించని రీతిలో అద్భుతమైన ఆట తీరుతో ఆకట్టుకుంది ప్యాట్ కమిన్స్ సారథ్యంలోని హైదరాబాద్ జట్టు.
క్వాలిఫయర్ -2 మ్యాచ్ లో సంజూ శాంసన్ సారథ్యంలోని రాజస్థాన్ రాయల్స్ కు షాక్ ఇచ్చింది. ఇదే క్రమంలో సూపర్ షోతో ఆకట్టుకుంటూ దుమ్ము రేపుతున్న శ్రేయాస్ అయ్యర్ నేతృత్వంలోని కోల్ కతా నైట్ రైడర్స్ కు బిగ్ షాక్ ఇవ్వాలని ప్రయత్నం చేసింది. కానీ ఏ కోశాన ధీటుగా జవాబు ఇవ్వలేక పోయింది సన్ రైజర్స్.
ప్రధానంగా కోల్ కతా నైట్ రైడర్స్ బౌలర్లు రెచ్చి పోయారు. హైదరాబాద్ బ్యాటర్లకు చుక్కలు చూపించారు. టోర్నీలో ప్రత్యర్థులకు చుక్కలు చూపిస్తూ వచ్చిన క్రికెటర్లంతా అలా వచ్చి ఇలా వెళ్లి పోయారు. పెవిలియన్ బాట పట్టారు.
ఎక్కడా పోటీ ఇవ్వలేక పోయారు. ఒక్క కెప్టెన్ ప్యాట్ కమిన్స్ తప్ప ఏ ఒక్కరూ రెండెంకల స్కోర్ దాట లేక పోయారు. మరోసారి మిచెల్ స్టార్క్ తో పాటు ఆండ్రీ రస్సెల్ క్రికెటర్లను శాసించారు.