హెచ్ సీ ఏకు ఐపీఎల్ అవార్డు
రూ. 50 లక్షల ప్రైజ్ మనీ
చెన్నై – ఐపీఎల్ 2024 కథ ముగిసింది. కోల్ కతా నైట్ రైడర్స్ విజేతగా నిలిచింది. ఫైనల్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ ను ఓడించింది. 8 వికెట్ల తేడాతో ఘోరంగా ఓటమి పాలైంది. తొలుత బ్యాటింగ్ చేసిన హైదరాబాద్ నిర్ణీత 20 ఓవర్లు ఆడకుండానే చాప చుట్టేసింది. 18.1 ఓవర్లకే ఆల్ అవుట్ అయ్యింది. 113 పరుగులు మాత్రమే చేసింది.
అనంతరం బరిలోకి దిగిన కోల్ కతా నైట్ రైడర్స్ 11.1 ఓవర్లలోనే కథ పూర్తి కానిచ్చేసింది. 114 పరుగులు చేసింది 2 వికెట్లు కోల్పోయి. ఆఫ్గాన్ కుర్రాడు గుర్బాజ్ 39 రన్స్ చేస్తే వెంకటేశ్ అయ్యర్ రెచ్చి పోయాడు. హాఫ్ సెంచరీతో కదం తొక్కాడు.
సన్ రైజర్స్ బౌలర్లను ఏకి పారేశారు ఈ ఇద్దరు ఆటగాళ్లు. ఇదిలా ఉండగా ఐపీఎల్ టోర్నీలో భాగంగా దేశ వ్యాప్తంగా ఎంపిక చేసిన మైదానాలలో మ్యాచ్ లు కొనసాగాయి. ఇక టోర్నీ ముగియడంతో అన్ని వసతులతో పాటు పిచ్ ను అద్భుతంగా తయారు చేసి ఉంచిన హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ కు బెస్ట్ పిచ్ అండ్ గ్రౌండ్ ఐపీఎల్ 2024 అవార్డు దక్కింది.
ఈ సందర్బంగా అసో సియేషన్ కు ఐపీఎల్ నజరానా ప్రకటించింది. ఈ మేరకు రూ. 50 లక్షల ప్రైజ్ మనీ లభించింది.