అత్యంత విలువైన ఆటగాడిగా నరైన్
488 పరుగులు 17 వికెట్లు
చెన్నై – బీసీసీఐ ఆధ్వర్యంలో నిర్వహించిన అత్యంత ప్రతిష్టాత్మకమైన ఇండియన్ ప్రిమీయర్ లీగ్ (ఐపీఎల్ ) 2024 ముగిసింది. విజేతగా శ్రేయాస్ అయ్యర్ సారథ్యంలోని కోల్ కతా నైట్ రైడర్స్ జట్టు విజేతగా నిలిచింది. 8 వికెట్ల తేడాతో సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టును ఓడించింది. తమకు ఎదురే లేదని చాటింది. గౌతం గంభీర్ మార్గదర్శకత్వంలో కోల్ కతా సత్తా చాటింది. అటు బ్యాటింగ్ లో ఇటు బౌలింగ్ లో దుమ్ము రేపింది.
ముందుగా బ్యాటింగ్ చేసిన సన్ రైజర్స్ ను 18.1 ఓవర్లలోనే 113 పరుగులకు కట్టడి చేసింది. మిచెల్ స్టార్క్ , ఆండ్రీ రస్సెల్, సునీల్ నరైన్, సతీశ్ లు కళ్లు చెదిరే బంతులతో ఆకట్టుకున్నారు. ప్రత్యర్థులకు చుక్కలు చూపించారు. కేవలం 14 పరుగులు ఇచ్చిన స్టార్క్ 2 వికెట్లు తీస్తే 19 రన్స్ ఇచ్చిన రస్సెల్ 3 వికెట్లు తీశాడు. సతీష్ మరో 2 వికెట్లు కూల్చితే , విండీస్ ఆటగాడు సునీల్ నరైన్ కీలకమైన వికెట్ తీశాడు.
ఇదిలా ఉండగా టోర్నీ మొత్తంగా ఐపీఎల్ ఎంపిక కమిటీ సంచలన ప్రకటన చేసింది. అత్యంత విలువైన ఆటగాడిగా సునీల్ నరైన్ ను ఎంపిక చేసింది. తను ఈ 17వ సీజన్ లో 488 పరుగులు చేశాడు. 17 వికెట్లు కూల్చాడు. ప్రైజ్ మనీ కింద నరైన్ కు రూ. 10 లక్షలు ఇచ్చింది.