రమన్ దీప్ సింగ్ కు అవార్డు
ఐపీఎల్ లో క్యాచ్ ఆఫ్ ద సీజన్
చెన్నై – ఐపీఎల్ 2024 ముగిసింది. ఆయా జట్లకు చెందిన పలువురు ఆటగాళ్లకు పలు పురస్కారాలు దక్కాయి. అత్యంత విలువైన ఆటగాడిగా కోల్ కతా నైట్ రైడర్స్ జట్టుకు చెందిన విండీస్ క్రికెటర్ సునీల్ నరైన్ కు దక్కింది. తను 488 రన్స్ చేశాడు. అంతే కాదు ఏకంగా 17 కీలకమైన వికెట్లు కూల్చాడు.
ఇక టోర్నీలో ఎమర్జింగ్ ప్లేయర్ అవార్డుకు తెలుగు కుర్రాడు ఏపీలోని విశాఖ పట్టణానికి చెందిన నితీశ్ కుమార్ రెడ్డి ఎంపికయ్యాడు. ఈ యువ క్రికెటర్ కు రూ. 10 లక్షల బహుమతి కింద దక్కింది. ఇక బెస్ట్ పిచ్ , మైదానం అవార్డును హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ పొందింది. ఇందులో భాగంగా హెచ్ సీ ఏకు రూ. 50 లక్షల ప్రైజ్ మనీ లభించడం విశేషం.
ఇక ఐపీఎల్ 17వ సీజన్ లో అత్యున్నతమైన క్యాచ్ అవార్డు (బెస్ట్ క్యాచ్ ) కింద కోల్ కతా నైట్ రైడర్స్ జట్టుకు చెందిన రమన్ దీప్ సింగ్ కు దక్కింది. తనకు ప్రైజ్ మనీ కింద రూ. 10 లక్షల బహుమానం లభించింది.