జాన్వీ కపూర్ హల్ చల్
ఐపీఎల్ 2024లో వైరల్
చెన్నై – ప్రముఖ బాలీవుడ్ నటి జాన్వీ కపూర్ వైరల్ గా మారారు. క్రీడా రంగానికి సీన రంగానికి మధ్య తర తరాల నుంచి అవినాభావ సంబంధం ఉంది. తాజాగా దివంగత నటి శ్రీదేవి కూతురు, అందాల ముద్దుగుమ్మ జాన్వీ కపూర్ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా మారారు.
తను చెన్నైలో తళుక్కున మెరిశారు. క్రికెట్ మ్యాచ్ ను తెగ ఎంజాయ్ చేశారు. చెన్నై లోని చెపాక్ స్టేడియం వేదికగా కీలకమైన ఫైనల్ పోరు కొనసాగింది. ఈ మ్యాచ్ ను జాన్వీ కపూర్ తో పాటు కోల్ కతా నైట్ రైడర్స్ జట్టు యజమానులు , ప్రముఖ బాలీవుడు నటీ నటులు జూహీ చావ్లాతో పాటు బాద్ షా షారుక్ ఖాన్ హాజరయ్యారు.
ఇదే సమయంలో సన్ రైజర్స్ హైదరాబాద్ తరపున సీఇవో గా ఉన్న కావ్య మారన్ హల్ చల్ చేసింది. కానీ తన జట్టు ఆశలపై నీళ్లు చల్లింది. కేవలం 113 పరుగులకే చాప చుట్టేసింది. నిర్ణీత 20 ఓవర్లు ఆడకుండానే 18.1 ఓవర్లకే చాప చుట్టేసింది.
ఇదే సమయంలో ఏడు మంది ఆటగాళ్లు రెండెంకల స్కోర్ ను కూడా దాటలేక పోయారు. ఇక కెప్టెన్ కమిన్స్ ఒక్కడే 24 రన్స్ చేశాడు. ఇదే అత్యధిక వ్యక్తిగత స్కోర్ . ఇదిలా ఉండగా ఫైనల్ మ్యాచ్ సందర్బంగా కమిన్స్ కొట్టిన బంతిని మిచెల్ స్టార్క్ జార విడిచాడు. దీంతో జాన్వీ కపూర్ విస్తు పోయింది. ఇందుకు సంబంధించిన ఫోటోలు నెట్టింట్లో హల్ చల్ చేస్తున్నాయి.