దేవుడిగా భావిస్తున్న మోడీ
నిప్పులు చెరిగిన ప్రియాంక
న్యూఢిల్లీ – ఏఐసీసీ జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆమె ప్రధాన మంత్రి నరేంద్ర మోడీని ఏకి పారేశారు. ఆయన తనను గొప్పగా ఊహించు కుంటున్నారని ఆరోపించారు. విచిత్రం ఏమిటంటే ప్రధాని తనను తాను దేవుడిగా భావిస్తున్నాడని ఎద్దేవా చేశారు.
పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆమె ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. దేశాన్ని సర్వ నాశనం చేసిన ఘనత మోడీకే దక్కుతుందన్నారు ప్రియాంక గాంధీ. విచిత్రం ఏమిటంటే ఇప్పటికే దేశాన్ని అన్ని రకాలుగా భ్రష్టు పట్టించిన ప్రధానమంత్రి ఇంకా ఏం చేశారని తనను పీఎంగా ఎన్ను కోవాలని ప్రశ్నించారు.
ఏనాడైనా ప్రజలు ఎదుర్కొంటున్న బాధల గురించి ఆరా తీశారు. వారి కోసం ఏమైనా చేశారా..ఇప్పటి వరకు ఒక్క పథకమైనా తీసుకు వచ్చారా అని ప్రశ్నించారు. వ్యవస్థలను బలోపేతం చేయాల్సిన ప్రధాన మంత్రి మోడీ బిలియనీర్లకు లబ్ది చేకూర్చేలా ప్రయత్నం చేయడం దారుణమన్నారు ప్రియాంక గాంధీ. ప్రజలు ఎన్నికల్లో తగిన రీతిలో బుద్ది చెప్పడం ఖాయమన్నారు.