NEWSNATIONAL

ఫిర్ ఏక్ బార్ మోడీ స‌ర్కార్

Share it with your family & friends

అన్ని స‌ర్వేలు..సంస్థ‌ల రాగం

న్యూఢిల్లీ – దేశ వ్యాప్తంగా ఎన్నిక‌ల వాతావ‌ర‌ణం ఇంకా కొన‌సాగుతూనే ఉంది. జూన్ 4 తేదీతో సంబురం ముగుస్తుంది. మొత్తం 545 స్థానాల‌కు గాను 543 లోక్ స‌భ స్థానాల‌కు ఎన్నిక‌లు జ‌రుగుతున్నాయి. ఇప్ప‌టి వ‌ర‌కు 6 విడత‌ల పోలింగ్ ముగిసింది. చెదురు మ‌దురు సంఘ‌ట‌న‌లు మిన‌హా పోలింగ్ ప్ర‌శాంతంగా కొన‌సాగింది.

ముంద‌స్తు స‌ర్వే ఫ‌లితాల‌కు సంబంధించిన ఎగ్జిట్ పోల్స్ అన్నీ గంప గుత్తగా మ‌రోసారి న‌రేంద్ర మోడీ ప్ర‌ధాన‌మంత్రి కాబోతున్నార‌ని పేర్కొంటున్నాయి. తాజాగా ప్ర‌ధాన మంత్రి ప‌లు జాతీయ , రాష్ట్ర స్థాయిల‌లో నిర్వ‌హిస్తున్న మీడియా సంస్థ‌లు ప్ర‌త్యేకంగా మోడీని ఇంట‌ర్వ్యూ చేశాయి. ఈ సంద‌ర్బంగా ఆయ‌న కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. ప‌లు ఆస‌క్తిక‌ర‌మైన అంశాల‌ను పంచుకున్నారు.

మోడీ కాంగ్రెస్ పార్టీపై నిప్పులు చెరిగారు. తాను ప్ర‌ధాన‌మంత్రిగా కొలువు తీరాక రూ. 38 ల‌క్ష‌ల కోట్లు పార‌ద‌ర్శ‌కంగా ల‌బ్దిదారుల‌కు బ‌దిలీ చేయ‌డం జ‌రిగింద‌న్నారు. కానీ హ‌స్తం పాల‌న‌లో దేశం స‌ర్వ నాశ‌న‌మైంద‌న్నారు. దివంగ‌త రాజీవ్ గాంధీ ప్ర‌ధానిగా ఉన్న కాలంలో ఏకంగా రూ. 30 ల‌క్ష‌ల కోట్ల అవినీతి చోటు చేసుకుంద‌ని ఆరోపించారు.