ఇండియా నా రెండో ఇల్లు
కీలక వ్యాఖ్యలు చేసిన హెడ్
తమిళనాడు – ఇండియన్ ప్రిమీయర్ లీగ్ 2024 ముగిసినా ఇంకా ఆ లీగ్ జ్ఞాపకాలు వెంటాడుతూనే ఉన్నాయి. 17వ లీగ్ సీజన్ లో విజేతగా నిలిచింది కోల్ కతా నైట్ రైడర్స్. గత సీజన్ లో పేలవమైన ప్రదర్శనతో నిరాశ పరిచిన సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు ఊహించని రీతిలో విజృంభించింది.
ప్రధానంగా ఆస్ట్రేలియా స్టార్ క్రికెటర్ ప్యాట్ కమిన్స్ సంచలనంగా మారారు. తనను ఐపీఎల్ వేలం పాటలో ఏకంగా రూ. 20 కోట్లకు పైగా ధర పెట్టి కొనుగోలు చేసింది జట్టు ఓనర్ కావ్య మారన్. అందరూ ఆమెను తప్పు పట్టారు. విదేశీ ఆటగాడికి ఇంత ప్రైజ్ ఎందుకంటూ ప్రశ్నించారు. కానీ సీన్ చూస్తే తన సత్తా ఏమిటో, తను ఉండడం వల్ల జట్టు ఎంత బలంగా ఉంటుందనే దానిని ఆచరణలో చేసి చూపించాడు.
హైదరాబాద్ జట్టుకు సంబంధించి ఓపెనర్లు ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మలు దంచి కొట్టారు. ఫోర్లు, సిక్సర్ల వరద పారించారు. ప్రధానంగా ట్రావిస్ ఏకంగా 64 ఫోర్లు కొట్టాడు. ఈ సందర్భంగా ట్రావిస్ హెడ్ కీలక వ్యాఖ్యలు చేశాడు. తన స్వంతిల్లు ఆస్ట్రేలియా అయినా తనకు రెండో ఇల్లు మాత్రం ఇండియానేనంటూ పేర్కొన్నాడు.