NEWSTELANGANA

కొల్లాపూర్ ను ఫ్యాక్ష‌న్ జోన్ గా ప్ర‌క‌టించాలి

Share it with your family & friends

వెంట‌నే పోలీస్ పికెట్లు ఏర్పాటు చేయాలి

హైద‌రాబాద్ – బీఆర్ఎస్ సీనియ‌ర్ నాయ‌కుడు, నాగ‌ర్ క‌ర్నూల్ లోక్ స‌భ అభ్య‌ర్థి ఆర్ఎస్ ప్ర‌వీణ్ కుమార్ నిప్పులు చెరిగారు. ఆయ‌న మ‌రోసారి మంత్రి జూప‌ల్లి కృష్ణా రావుపై సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు. త‌మ పార్టీకి చెందిన నాయ‌కుడు శ్రీ‌ధ‌ర్ రెడ్డిని పొట్ట‌న పెట్టుకున్న వారికి వ‌త్తాసు ప‌లుకుతున్న వారెవ‌రో తేల్చాల‌ని డిమాండ్ చేశారు. ఈ మేర‌కు ఆయ‌న మాజీ ఎమ్మెల్యే బీరం హ‌ర్ష‌వ‌ర్ద‌న్ రెడ్డితో క‌లిసి డీజీపీ ర‌వి గుప్తాను క‌లిసి విన‌తిప‌త్రం స‌మ‌ర్పించారు.

అనంత‌రం ఆర్ఎస్ ప్ర‌వీణ్ కుమార్ మీడియాతో మాట్లాడారు. హత్యకు సంబంధించి ఎఫ్ఐఆర్ లో పేర్కొన్న ప్రధాన నిందితులు కృష్ణ ప్రసాద్, మహేష్ లను పోలీసులు విచారించకుండా కేవలం బాధితుడి సన్నిహితులను విచారణ పేరుతో ఇబ్బంది పెడుతున్నారని ఆవేద‌న వ్య‌క్తం చేశారు.

ఈ హత్య వెనుక మంత్రి జూపల్లి కృష్ణారావు హస్తం ఉందని తల్లిదండ్రులు చెబుతున్నారని తెలిపారు. హంతకులు యదేచ్ఛగా మంత్రి ఇంట్లోనే మీడియా సమావేశం నిర్వహించి బాధితుడి వ్యక్తిత్వాన్ని దిగజార్చేలా నిందారోపణలు చేస్తున్నారని ఆరోపించారు

మంత్రికి వత్తాసు పలుకుతున్న కొంత మంది పోలీసు అధికారులను తక్షణమే డిస్మిస్ చేయాలని అన్నారు. కొల్లాపూర్ ప్రాంతాన్ని ఫ్యాక్షన్ జోన్ గా ప్రకటించి ,ప్రత్యేక పోలీస్ పికెట్లను ఏర్పాటు చేయాలని డీజీపీని కోరామ‌న్నారు ఆర్ఎస్పీ.