మోడీ వస్తే రాజ్యాంగానికి ముప్పు
నిప్పులు చెరిగిన ప్రియాంక గాంధీ
న్యూఢిల్లీ – ఏఐసీసీ జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆమె ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ సర్కార్ పై మండిపడ్డారు. సోమవారం మీడియాతో మాట్లాడిన ప్రియాంక గాంధీ గతంలో ఎన్నడూ లేని రీతిలో దేశం క్లిష్ట పరిస్థితుల్లో ఉందన్నారు.
ప్రజాస్వామ్యం మరింత ప్రమాదంలోకి నెట్టి వేసిన ఘనత మోడీకే దక్కుతుందన్నారు ప్రియాంక గాంధీ. రాజ్యాంగాన్ని కాపాడు కోవాల్సిన బాధ్యత ప్రతి భారతీయుడిపై ఉందని స్పష్టం చేశారు. రాజ్యాంగం ప్రశ్న అత్యంత లోతైనది, అత్యంత తీవ్రమైనదని పేర్కొన్నారు.
రాజ్యాంగాన్ని మార్చనంటూ నమ్మించే ప్రయత్నం మోడీ చేస్తున్నాడని, కానీ ఆయన ఇప్పటి వరకు చెప్పిన ఏ ఒక్క మాటకు కట్టుబడి ఉండలేదని ఆరోపించారు ప్రియాంక గాంధీ. పేదలు, సామాన్యులు, మధ్యతరగతి ప్రజలంటే ప్రధానికి చులకన భావం అని పేర్కొన్నారు. రాజ్యాంగాన్ని మార్చాలని పదే పదే చెబుతూ వచ్చిన పీఎం ఉన్నట్టుండి మాట మార్చాడని అన్నారు. దీని వెనుక ఒత్తిళ్లు ఉండడం వల్లనే అని తెలిపారు.