మోడీ మోసం దేశానికి నష్టం
నిప్పులు చెరిగిన ప్రియాంక
హిమాచల్ ప్రదేశ్ – ఏఐసీసీ జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ నిప్పులు చెరిగారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీని ఏకి పారేశారు. తన వల్లనే ఈ దేశానికి ఎలాంటి మేలు జరగక పోగా అపారమైన నష్టం వాటిల్లిందని ఆవేదన వ్యక్తం చేశారు.
ఇవాళ దేశ వ్యాప్తంగా నిరుద్యోగులు జాబ్స్ కోసం వేచి ఉన్నారని అన్నారు. యువతకు ఉపాధి కల్పించాలని మోడీ బిలియనీర్లకు లబ్ది చేకూర్చేలా నిర్ణయాలు తీసుకున్నారని ఆరోపించారు ప్రియాంక గాంధీ. పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళవారం హిమాచల్ ప్రదేశ్ లోని షాపూర్ లో జరిగిన బహిరంగ సభలో ప్రియాంక గాంధీ ప్రసంగించారు.
యువతకు భరోసా కల్పించాలని ప్రధాని వారి పాలిట శాపంగా మారాడని అన్నారు. అగ్ని వీర్ పథకంతో వారి ఆశలపై నీళ్లు చల్లాడని, అన్ని రంగాలను ధ్వంసం చేస్తూ వచ్చిన ప్రధాని చివరకు రక్షణ , సైనిక రంగాన్ని కూడా నిర్వీర్యం చేశాడని ధ్వజమెత్తారు ప్రియాంకా గాంధీ. ఇలాంటి వ్యక్తిని పీఎంగా ఎన్నుకుంటే దేశాన్ని అమ్మేస్తాడని సంచలన ఆరోపణలు చేశారు.