సీఎం కేజ్రీవాల్ కు సుప్రీం షాక్
అత్యవసర విచారణకు నో
న్యూఢిల్లీ – ఆమ్ ఆద్మీ పార్టీ చీఫ్ , ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కు కోలుకోలేని దెబ్బ తగిలింది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఆయన నిందితుడిగా ఉన్నారు. ఈ మేరకు ఇప్పటికే జైలు పాలయ్యారు. సార్వత్రిక ఎన్నికల సందర్బంగా భారత దేశ సర్వోన్నత ప్రధాన న్యాయ స్థానం సుప్రీంకోర్టు కేజ్రీవాల్ కు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. కేవలం ప్రచారంలో పాల్గొనేందుకు ఛాన్స్ ఇస్తున్నట్లు పేర్కొంది.
ఇదిలా ఉండగా ప్రస్తుతం ఆయన బెయిల్ ముగిసేందుకు సమయం ఆసన్నం కావడంతో కేజ్రీవాల్ తరపు న్యాయవాది అభిషేక్ సింఘ్వి సుప్రీంకోర్టును ఆశ్రయించారు . సీఎం తరపున పిటిషన్ దాఖలు చేవారు. మధ్యంతర బెయిల్ ను మరో 7 రోజుల పాటు పొడిగించాలని కోరారు.
ఇందుకు సంబంధించి అత్యవసరంగా పిటిషన్ ను విచారించాలని పిటిషన్ లో విన్నవించారు. దీనిపై మంగళవారం విచారణ చేపట్టింది సుప్రీంకోర్టు ధర్మాసనం. ఈ మేరకు దీనిపై త్వరగా విచారణ చేపట్ట లేమంటూ స్పష్టం చేసింది. అనారోగ్యంగా ఉంటే వైద్య పరీక్షలు చేయించు కోవాలే తప్పా విచారణను ముందు చేపట్టలేమని పేర్కొంది కోర్టు.