ANDHRA PRADESHNEWS

నైపుణ్యం ఉపాధికి సోపానం

Share it with your family & friends

బుగ్గ‌న రాజేంద్ర నాథ్ రెడ్డి

అమరావతి – నైపుణ్యం అల‌వ‌ర్చుకుంటే ఉపాధికి ఢోకా అంటూ ఉండ‌ద‌న్నారు ఏపీ ఆర్థిక శాఖ మంత్రి బుగ్గ‌న రాజేంద్ర నాథ్ రెడ్డి. త‌మ స‌ర్కార్ యువ‌తీ యువ‌కుల‌కు ఉద్యోగ అవ‌కాశాలు పెంచే విధంగా ప్ర‌య‌త్నం చేస్తోంద‌న్నారు. ఇందులో భాగంగా యువ‌త‌కు మేలు చేకూర్చేలా దృష్టి సారించామ‌న్నారు.

యువ‌త‌కు, అర్హులైన ఉద్యోగార్థులు, విద్యార్థుల‌కు మేలు చేకూర్చేందుకు గాను ఆన్ లైన్ లో ద‌ర‌ఖాస్తు చేసుకునేలా ప్ర‌ణాళిక త‌యారు చేశామ‌ని చెప్పారు మంత్రి. ఇందుకు గాను ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉపాధి అవ‌కాశాల‌కు సంబంధించిన స‌మ‌స్త స‌మాచారాన్ని వెబ్ పోర్టల్ లో ఏర్పాటు చేయ‌డం జ‌రిగింద‌న్నారు .

ఈ మేర‌కు బుగ్గ‌న రాజేంద్ర నాథ్ రెడ్డి ‘ఎంప్లాయ్ మెంట్ ఎక్స్ఛేంజ్’ వెబ్ పోర్టల్ ను ఆవిష్కరించారు. గతంలో సీనియార్టిని బట్టి ఉద్యోగాల భర్తీ జరిగేదని..ఇప్పుడు మారుతున్న పరిస్థితులకు తగ్గట్లు వెబ్ పోర్టల్ ప్రారంభించామ‌ని తెలిపారు.

దీని వ‌ల్ల యువతకు ఎంతో ఉపయోగం క‌లుగుతుంద‌న్నారు. జాబ్స్ రావాల‌ని అనుకునే వారికి ఎక్కడెక్కడో వెత‌కాల్సిన‌ పని లేకుండా సమస్త సమాచారం, సమగ్ర రంగాలకు సంబంధించిన వివరాలను ఇందులో పొందు ప‌ర్చ‌డం జ‌రిగింద‌ని తెలిపారు బుగ్గ‌న రాజేంద్ర నాథ్ రెడ్డి.

10వ త‌ర‌గ‌తి నుండి ఇంట‌ర్, డిగ్రీ, డిప్లొమా ఏది చేసినా స‌రే employment.ap.gov.in పోర్టల్ లో నమోదు చేసుకుంటే చాల‌న్నారు. అంతా ఉచితమేన‌ని స్ప‌ష్టం చేశారు ఆర్థిక మంత్రి.