మోడీని ధోనీతో పోల్చిన అన్నామలై
ఆయనకంటే పనిమంతుడు ఉన్నాడా
తమిళనాడు – భారతీయ జనతా పార్టీ చీఫ్ అన్నామలై కుప్పు స్వామి సంచలన ప్రకటన చేశారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రతిపక్షాలు పదే పదే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గురించి మాట్లాడుతున్నారని ఇది తగదని పేర్కొన్నారు. బీజేపీలో 75 ఏళ్లు వచ్చిన ఏ నాయకుడు అయినా సరే ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పు కోవాలని తీర్మానం చేశారంటూ గుర్తు చేశారు సీఎం అరవింద్ కేజ్రీవాల్. ఆయన చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. ఇంకా చర్చకు దారి తీస్తున్నాయి.
ఇదే అంశం గురించి ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ కూడా జాతీయ మీడియాతో మాట్లాడుతూ పంచుకున్నారు. తాను 2047 వరకు ఉంటానని , దేశాన్ని అభివృద్ది పథంలో పయనించేంత వరకు నిద్ర పోనంటూ పేర్కొన్నారు. దీని ద్వారా తాను మరోసారి పీఎం అవుతానని చెప్పకనే చెప్పారు.
ఇదే విషయం గురించి ప్రస్తావించారు కె. అన్నామలై. ప్రధాన మంత్రి మోడీని ప్రముఖ మాజీ క్రికెటర్ మహేంద్ర సింగ్ ధోనీతో పోల్చారు. ఇటీవల ధోనీ ఏమన్నాడంటే తనకంటే ఎక్కువ ఆటగాడు ఉంటే తప్పుకునేందుకు సిద్దమన్నాడు.
ఇదే విషయం మోడీకి కూడా వర్తిస్తుందని చెప్పారు అన్నామలై. మోడీని ఢీకొనే సత్తా , ఆయనతో సరి సమానంగా తూగే నాయకుడు తమ పార్టీలో లేరన్నారు. ఆయనే పీఎంగా ఉంటారని చెప్పారు.