చంపినా సరే ప్రశ్నిస్తూనే ఉంటా
యూట్యూబర్ ధ్రువ్ రాఠీ ప్రకటన
న్యూఢిల్లీ – ప్రముఖ యూట్యూబర్ ధ్రువ్ రాఠీ సంచలన వ్యాఖ్యలు చేశారు. తనను చంపుతామని పదే పదే బెదిరింపులు వస్తున్నాయని, భారత దేశంలో కొలువు తీరిన నరేంద్ర మోడీ, భారతీయ జనతా పార్టీ సర్కార్ గురించి వ్యతిరేకంగా మాట్లాడ వద్దంటూ పెద్ద ఎత్తున హెచ్చరికలు కూడా వస్తూనే ఉన్నాయని తెలిపారు.
ధ్రువ్ రాఠీ ట్విట్టర్ వేదికగా స్పందించారు. తాను బెదిరింపులకు , హెచ్చరికలకు భయపడే వ్యక్తిని కానంటూ స్పష్టం చేశారు. తాను ఏ పార్టీకి కొమ్ము కాయడం లేదన్నారు. కేవలం ఒక భారతీయుడిగా తన విద్యుక్త ధర్మాన్ని నిర్వహిస్తున్నానని , ఒక బాధ్యత కలిగిన పౌరుడిగా తాను ప్రశ్నిస్తూనే ఉన్నానని..చంపినా తన వాయిస్ ను వదులుకునే ప్రసక్తి లేదన్నారు.
ఆయన ప్రధానంగా తనపై లేనిపోని ఆరోపణలు చేసిన ఆప్ ఎంపీ , ఢిల్లీ విమెన్స్ కమిషన్ చైర్ పర్సన్ స్వాతి మలివాల్ ను ఉద్దేశించి ఈ వ్యాఖ్యలు చేశారు. ఎవరు ఏమిటనేది ప్రజలకు తెలుసన్నారు. తను ఎవరి పక్షాన ఉండి మాట్లాడుతున్నదో కూడా జనం గమనిస్తున్నారని పేర్కొన్నారు ధ్రువ్ రాఠీ.