తెలంగాణలో జాబ్స్ జాడేది..?
నిప్పులు చెరిగిన ఆర్ఎస్పీ
హైదరాబాద్ – నాగర్ కర్నూల్ లోక్ సభ బీఆర్ఎస్ అభ్యర్థి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ నిప్పులు చెరిగారు. రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డిని, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏకి పారేశారు. 50 రోజుల పాలన పూర్తిగా అస్తవ్యస్తంగా మారిందని ఆరోపించారు. ఆరు గ్యారెంటీల పేరుతో ప్రజలను నిట్ట నిలువునా మోసం చేసి పవర్ లోకి వచ్చారని మండిపడ్డారు.
కొలువు తీరిన వెంటనే రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 2 లక్షల జాబ్స్ ను తక్షణమే భర్తీ చేస్తానని ప్రకటించిన సీఎం రేవంత్ రెడ్డి ఎందుకు మౌనంగా ఉన్నారో చెప్పాలని ప్రశ్నించారు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. ఇప్పటికే పరీక్షలు రాసి ఫలితాలు వచ్చినా నియామక పత్రాలు ఎందుకు ఇవ్వడం లేదో ఎప్పుడైనా ఒక్క నిమిషం అయినా సీఎం ఆలోచించారా అని నిలదీశారు ఆర్ఎస్పీ.
తెలంగాణ రాష్ట్ర గీతానికి ఆంధ్రా ప్రాంతానికి చెందిన సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణితో స్వర కల్పన చేయించడం పట్ల తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇదే సమయంలో ట్విట్టర్ వేదికగా ఆర్ఎస్పీ కీలక వ్యాఖ్యలు చేశారు.
తెలంగాణ అగ్ని మాపక శాఖలో డ్రైవర్ ఆపరేటర్ , పీటీఓ డ్రైవర్లుగా ఎంపికైన 325 మంది అభ్యర్థులకు ఇంకా శిక్షణకు పిలవక పోవడం దారుణమన్నారు.