ENTERTAINMENT

స్టాండ‌ప్ క‌మెడియ‌న్ వైర‌ల్

Share it with your family & friends

మేక‌ప్ ఆర్టిస్ట్ తో రెండో పెళ్లి

ముంబై – ప్ర‌ముఖ స్టాండ‌ప్ క‌మెడియ‌న్ మునావ‌ర్ ఫారూఖీ సంచ‌ల‌నంగా మారారు. దేశ వ్యాప్తంగా త‌న ప్ర‌ద‌ర్శ‌న‌ల‌తో గుర్తింపు పొందారు. ప్ర‌ధానంగా దేశంలో కొలువు తీరిన భార‌తీయ జ‌న‌తా పార్టీని, దాని అనుబంధ సంస్థ‌ల‌తో పాటు ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోడీ, అమిత్ షాల ను ఏకి పారేస్తూ వ‌చ్చారు. ఆయ‌న‌పై కేసులు కూడా న‌మోద‌య్యాయి.

క‌ర్ణాట‌క‌లో అప్ప‌టి బీజేపీ స‌ర్కార్ హ‌యాంలో త‌న షోను బెంగ‌ళూరులో జ‌ర‌గ‌నీయ‌కుండా అడ్డుకున్నారు. మునావ‌ర్ ఫారూఖీ ఎక్క‌డికి వెళ్లినా హిందూ వాద సంస్థ‌లు పెద్ద ఎత్తున నిర‌న‌స వ్య‌క్తం చేశాయి. ఆయ‌న‌పై దాడి చేసేందుకు కూడా ప్ర‌య‌త్నించాయి.

అయినా ఎక్క‌డా త‌గ్గ‌లేదు స్టాండ‌ప్ క‌మెడియ‌న్. త‌న‌కు వ‌ర‌ల్డ్ వైడ్ గా లెక్కించ లేనంత మంది అభిమానులు ఉన్నారు. ఇదిలా ఉండ‌గా ప్ర‌స్తుతం నెట్టింట్లో వైర‌ల్ గా మారారు ఫారుఖీ. త‌ను తొలి భార్య‌కు విడాకులు ఇచ్చాడు. త‌ను రెండో పెళ్లి చేసుకున్నాడు. మేక‌ప్ ఆర్టిస్ట్ మెహే జ‌బీన్ కోట్ వాల‌ను వివాహం చేసుకున్నాడు మున్వార్ పారూఖీ.