కేసీఆర్ కు తెలిసే లిక్కర్ స్కామ్
కేంద్ర దర్యాప్తు సంస్థ ఈడీ నివేదిక
న్యూఢిల్లీ – ఢిల్లీ లిక్కర్ స్కామ్ కు సంబంధించి రోజుకో ట్విస్ట్ చోటు చేసుకుంటోంది. దేశ వ్యాప్తంగా సంచలనం కలిగించిన ఈ కేసులో తీవ్రమైన ఆరోపణలు చేసింది కేంద్ర దర్యాప్తు సంస్థ ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ). ఈ మేరకు కోర్టుకు సమర్పించిన నివేదికలో సంచలన విషయాలు వెల్లడించింది.
ఢిల్లీ లిక్కర్ స్కామ్ గురించి ప్రతి విషయం తెలంగాణ మాజీ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుకు తెలుసని పేర్కొంది. ఈ వ్యాపారం, కుంభకోణం గురించి ప్రతి అంశాన్ని తన కూతురు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత చెబుతూ వచ్చిందని బాంబు పేల్చింది.
నిన్నటి దాకా చిలుక పలుకులు పలికిన కవిత విచారణలో ఈ విషయం వెల్లడించిందని పేర్కొంది. ఈ మొత్తం వ్యవహారంలో కేసీఆర్ కు కూడా భాగం ఉందని వెల్లడించింది. దీంతో ఈ స్కామ్ కేసు తండ్రీ బిడ్డల మెడకు చుట్టుకునే ఛాన్స్ ఉందని భావిస్తున్నారు.
ఇప్పటి వరకు ఈ కేసుకు సంబంధించి పలువురిని అదుపులోకి తీసుకుంది ఈడీ. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ను కూడా అరెస్ట్ చేసింది..ఆయన ప్రస్తుతం మధ్యంతర బెయిల్ పై బయట ఉన్నారు.