రాష్ట్ర వేడుకలకు సోనియా గాంధీ
ఆహ్వానించామన్న సీఎం రేవంత్ రెడ్డి
హైదరాబాద్ – తెలంగాణ రాష్ట్రం ఏర్పాటై వచ్చే జూన్ నెల 2వ తేదీ నాటికి 10 ఏళ్లు పూర్తవుతాయి. రాదని అనుకున్న తెలంగాణను తీసుకు రావడంలో కీలక పాత్ర పోషించారు మాజీ సీఎం , బీఆర్ఎస్ బాస్ కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు.
ఆయన 10 సంవత్సరాల పాటు ముఖ్యమంత్రిగా రాష్ట్రాన్ని పాలించారు. కొత్తగా ఏర్పడిన తెలంగాణకు తొలి సీఎంగా ఘనత వహించారు. ఆయనపై అనేకమైన అవినీతి, ఆరోపణలు ఉన్నాయి. దీంతో రాష్ట్రంలో ఇటీవల జరిగిన శాసన సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ ను బండకేసి కొట్టారు జనం.
ఇదిలా ఉండగా జూన్ 2న తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు నూతన సర్కార్ విస్తృతంగా ఏర్పాట్లు చేస్తోంది. ఈ మేరకు సీఎం ఎనుముల రేవంత్ రెడ్డి అధ్యక్షతన ప్రత్యేకంగా కేబినెట్ సమావేశం అయ్యింది.
ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర గీతంగా ప్రముఖ కవి, రచయిత, గాయకుడు అందెశ్రీ రాసిన జయ జయహే తెలంగదాణను ప్రకటించారు. నేటి పరిస్థితులకు అనుగుణంగా కొన్ని మార్పులు చేయాలని సూచించారు. దీనికి ఆంధ్రాకు చెందిన మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి స్వర కల్పన చేస్తున్నారు. ఇక కేసీఆర్ సర్కార్ రూపొందించిన రాజ ముద్రను కూడా మార్చనున్నారు.
రాష్ట్ర ఆవిర్భావ వేడుకలకు సీపీపీ చైర్ పర్సన్ సోనియా గాంధీని ఆహ్వానించినట్లు చెప్పారు సీఎం రేవంత్ రెడ్డి.