NEWSNATIONAL

కాంగ్రెస్ స‌ర్కార్ పై మోడీ క‌క్ష

Share it with your family & friends

ఏఐసీసీ నేత ప్రియాంక గాంధీ

హిమాచ‌ల్ ప్ర‌దేశ్ – ఏఐసీసీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి ప్రియాంక గాంధీ కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. సార్వ‌త్రిక ఎన్నిక‌ల ప్ర‌చారంలో భాగంగా ఆమె హిమాచ‌ల్ ప్ర‌దేశ్ రాష్ట్రంలో ప‌ర్య‌టించారు. ఈ సంద‌ర్బంగా జ‌రిగిన బ‌హిరంగ స‌భ‌లో ప్ర‌సంగించారు.

హిమాచ‌ల్ ప్ర‌దేశ్ లో కొలువు తీరిన కాంగ్రెస్ ప్ర‌భుత్వంపై కేంద్రంలో కొలువు తీరిన భార‌తీయ జ‌న‌తా పార్టీ మోడీ సర్కార్ క‌క్ష సాధింపు ధోర‌ణి ప్ర‌ద‌ర్శిస్తోంద‌ని ఆరోపించారు. దేశంలోని వ్య‌వ‌స్థ‌ల‌ను స‌ర్వ నాశ‌నం చేసిన ఘ‌న‌త మోడీకే ద‌క్కుతుంద‌న్నారు.

విచిత్రం ఏమిటంటే హిమాచల్ ప్ర‌దేశ్ లో విపత్తు సంభవించినప్పుడు, కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం ఒక్క పైసా కూడా సహాయం చేయలేదని ఆరోపించారు ప్రియాంక గాంధీ. కొన్ని నెలల తర్వాత ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాన్ని పడగొట్టే ప్రయత్నం జరిగిందన్నారు.

ఎమ్మెల్యేకు డబ్బులు చెల్లించి పార్టీ మారేలా చేయడం ప్రజాస్వామ్యానికి విరుద్ధమ‌న్నారు. ఈ నేరం ఎవరు చేశారో దేశానికి చెప్పాల్సిన అవ‌స‌రం ఉంద‌న్నారు ప్రియాంక గాంధీ. రాబోయే రోజుల్లో గ‌నుక మోదీ పీఎం అయితే దేశాన్ని అమ్మేస్తారంటూ ఆరోపించారు.