మోడీ ఉద్యోగాల జాడేది..?
నిప్పులు చెరిగిన ప్రియాంక
హిమాచల్ ప్రదేశ్ – ఏఐసీసీ జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ నిప్పులు చెరిగారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో పర్యటించి ప్రసంగించారు. ఇప్పటి వరకు 6 విడతల పోలింగ్ ముగిసిందని, ఇక ఏకైక ఆఖరి విడత 7వ విడత పోలింగ్ మాత్రమే మిగిలి ఉందన్నారు ప్రియాంక గాంధీ.
ఈ సందర్బంగా ఈ పది సంవత్సరాల పరిపాలనా కాలంలో మోడీ ఈ దేశానికి ఏం చేశాడో చెప్పాలని ప్రియాంక గాంధీ డిమాండ్ చేశారు. ప్రతి ఏడాదికి 2 కోట్ల జాబ్స్ ఇస్తానని హామీ ఇచ్చారని ఇప్పటి వరకు కనీసం 50 వేల పోస్టులు కూడా భర్తీ చేయలేక పోయారని ఆవేదన చెందారు .
రోజు రోజుకు ద్రవ్యోల్బణంతో పాటు నిరుద్యోగం తారా స్థాయికి చేరుకుందన్నారు. దేశంలో 70 కోట్ల మంది నిరుద్యోగులు ఉన్నారని ఆరోపించారు. కోట్లాది మంది ప్రతిభావంతులుగా ఉన్నప్పటికీ వారికి ఆశించిన మేర ఉపాధి లభించడం లేదన్నారు.
ప్రజలు రోజు రోజుకు తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, గతంలో ఎన్నడూ లేని రీతిలో నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయని ఆరోపించారు.