ఏపీ సర్కార్ అభివృద్దికి నమూనా
స్పష్టం చేసిన సీఎం జగన్ రెడ్డి
అమరావతి – వచ్చే జూన్ 4న ఏపీకి సంబంధించిన శాసన సభ , లోక్ సభ స్థానాల ఫలితాలు వెల్లడి కానున్నాయి. ఈసారి అధికారంలో ఉన్న వైసీపీకి టీడీపీ కూటమికి మధ్య హోరా హోరీ పోరు కొనసాగింది. ఎవరు గెలుస్తారనే దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.
భారీ ఎత్తున పోలింగ్ శాతం నమోదు కావడంతో అటు వైసీపీ ఇటు కూటమి ఎవరికి వారే గెలుపు ధీమాను వ్యక్తం చేస్తున్నారు. కాగా వైసీపీ విజయం నల్లేరు మీద నడకేనంటూ ఇప్పటికే ప్రకటించారు సీఎం జగన్ మోహన్ రెడ్డి. అంతే కాకుండా జూన్ 9న ప్రమాణ స్వీకారం కోసం ముహూర్తం కూడా ఖరారు చేసింది వైసీపీ.
ఆరోజు ఉదయం 9.18 గంటలకు జగన్ మోహన్ రెడ్డి రెండవ సారి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సీఎం కాబోతున్నారంటూ పార్టీకి చెందిన మంత్రి బొత్స సత్యనారాయణ ప్రకటించారు. మరో వైపు తాము చేపట్టిన సంక్షేమ పథకాలే తమను గట్టెక్కిస్తాయనే నమ్మకంతో ఉన్నారు జగన్ రెడ్డి. 4 పోర్టులతో పాటు 17 మెడికల్ కాలేజీలు నిర్మించామన్నారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో దేశంలోనే ఏపీ నెంబర్ వన్ స్థానంలో నిలిచిందన్నారు సీఎం.