నా నాయకత్వం దేశానికి అవసరం
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ
పశ్చిమ బెంగాల్ – దేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇంకో రెండు రోజుల్లో దేశ వ్యాప్తంగా 7వ చివరి విడత పోలింగ్ జరగనుంది. ఇప్పటి వరకు 6 విడతల పోలింగ్ ముగిసింది. మొత్తం 543 స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ప్రస్తుతం దేశంలో కొలువు తీరిన మోడీ సర్కార్ కు ప్రతిపక్షాలతో కూడిన ఇండియా కూటమికి మధ్య నువ్వా నేనా అన్న రీతిలో పోటీ నెలకొంది.
ఇదిలా ఉండగా ప్రతిపక్ష కూటమిలో ఉన్న టీఎంసీ ప్రాతినిధ్యం వహిస్తున్న పశ్చిమ బెంగాల్ లో విస్తృతంగా పర్యటించారు నరేంద్ర మోడీ. ఈ సందర్బంగా జరిగిన సభలో ప్రసంగించారు. ఆరు నూరైనా సరే వంగ భూమిలో బీజేపీ జెండా ఎగరడం ఖాయమన్నారు.
దేశ వ్యాప్తంగా తన నాయకత్వాన్ని కోరుకుంటున్నారని, ఈ దేశానికి ముచ్చటగా మూడోసారి పీఎం తానే కానున్నట్లు ప్రకటించారు. ప్రతిపక్షాలు అక్రమాలు, మోసాలు, అవినీతికి కేరాఫ్ గా మారాయని ఆరోపించారు. తమకు ఈసారి 17వ ఎన్నికల్లో 400 సీట్లకు పైగానే వస్తాయని చెప్పారు.
మొత్తంగా తనను 143 కోట్ల మంది భారతీయులు కోరుకుంటున్నారని తెలిపారు. ఇందులో ఎలాంటి అనుమానం అక్కర్లేదన్నారు.