ఉష్ణోగ్రతలో ఢిల్లీ రికార్డ్ బ్రేక్
రెడ్ అలర్ట్ జారీ చేసిన సర్కార్
న్యూఢిల్లీ – దేశ రాజధాని రికార్డు సృష్టించింది. భారీ ఎత్తున ఎండ వేడిమితో జనం బెంబేలెత్తి పోతున్నారు. ఎక్కడ చూసినా వేడి తీవ్రత మరింత పెరుగుతోంది. దీంతో ప్రభుత్వం సంచలన ప్రకటన చేసింది. ఈ మేరకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. జనం అత్యవసరమైతే తప్పా బయటకు రావద్దని కోరింది. ఎండ గాలుల తీవ్రత రోజు రోజుకు ఎక్కువవుతోందని పేర్కొంది.
ఏకంగా ఢిల్లీలో రికార్డు స్థాయిలో 52.3 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదు కావడం గమనార్హం. ఇక ఇరాన్ విమానాశ్రయంలో ఉష్ణోగ్రత 66 డిగ్రీల సెల్సియస్‌గా నమోదైంది. భూమి సగటు ఉష్ణోగ్రత పారిశ్రామిక పూర్వ కాలం నుండి సుమారు 1.2 డిగ్రీల సెల్సియస్ పెరిగింది
భారతదేశం పరంగా చూస్తే వాస్తవ గరిష్ట ఉష్ణోగ్రత 45 డిగ్రీల సెల్సియస్ లేదా అంతకంటే ఎక్కువ ఉన్నప్పుడు ఒక ప్రాంతంపై హీట్ వేవ్ ప్రకటించ బడుతుంది.
అంతకు ముందు, రాజస్థాన్‌లోని చురు ఈ సీజన్‌లో 50.5 డిగ్రీల సెల్సియస్‌తో అత్యంత వెచ్చని జిల్లాగా నివేదించబడింది. ఇవాళ దీనిని ఢిల్లీ రికార్డు బద్దలు కొట్టింది.