నియంతను కాదు సేవకుడిని
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ
న్యూఢిల్లీ – నేను నియంతను కానని ప్రజా సేవకుడినంటూ స్పష్టం చేశారు ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ. సార్వత్రిక ఎన్నికల సందర్భంగా ఆయన మీడియాతో సంభాషించారు. ప్రతిపక్షాలు తనను పదే పదే డిక్టేటర్ అంటూ ఆరోపణలు చేస్తున్నారని కానీ వారికి తన గురించి తెలిసింది చాలా తక్కువేనని పేర్కొన్నారు మోడీ.
ప్రధానంగా ఆయన తనను టార్గెట్ చేస్తూ సోషల్ మీడియాలో ఎక్కువగా ట్రోల్ చేస్తున్న ప్రముఖ యూట్యూబర్ ధ్రువ్ రాఠీ గురించి పరోక్షంగా హెచ్చరించారు. తన పేరుతో తను డిక్టేటర్ మోడీ అంటూ చేసిన వీడియోను కోట్లాది మంది వీక్షించారు. ప్రధానంగా ధ్రువ్ రాఠీ సంచలనంగా మారారు. తాజాగా దేశంలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఎక్కువగా ప్రతిపక్షాల కంటే రాఠీ గురించిన చర్చే ఎక్కువగా నడిచింది.
ఒక దేశానికి బాధ్యత వహిస్తున్న సమయంలో కొందరికి ఇబ్బంది కలుగుతుంది. ఇంకొందరికి మేలు ఒనగూరుతుంది. తనకు ఉండేందుకు ఇల్లు లేదని, ప్రయాణం చేసేందుకు వాహనం కూడా లేదన్నారు. ఈ విషయం ప్రజలందరికీ తెలుసన్నారు మోడీ. తాను పాలకుడిని కానని సేవకుడినంటూ స్పష్టం చేశారు.