మోడీ పాలన అభివృద్దికి నమూనా
మండి బీజేపీ అభ్యర్థి కంగనా
హిమాచల్ ప్రదేశ్ – ప్రముఖ బాలీవుడ్ నటి కంగనా రనౌత్ కీలక వ్యాఖ్యలు చేశారు. నరేంద్ర మోడీ పాలన అభివృద్దికి నమూనా అని పేర్కొన్నారు. హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలోని మండి లోక్ సభ స్థానం నుంచి ఆమె కాషాయ పార్టీ తరపున అభ్యర్థిగా బరిలో ఉన్నారు.
ఈ సందర్బంగా కీలక వ్యాఖ్యలు చేశారు. దేశంలోని 143 కోట్ల మంది భారతీయులు మూకుమ్మడిగా సమర్థవంతమైన నాయకుడైన నరేంద్ర మోడీని పీఎంగా చూడాలని అనుకుంటున్నారని చెప్పారు. ఇవాళ డిజటల్ ఎకానమీ రంగంలో ఇండియాను టాప్ లో నిలిపిన ఘనత ప్రధానమంత్రికే దక్కుతుందన్నారు కంగనా రనౌత్.
తనకు పోటీ చేసేందుకు అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియ చేసుకుంటున్నానని అన్నారు నటి. మోడీ మోస్ట్ పాపులర్ లీడర్ ఎందుకయ్యారంటే కేవలం ఆయన దేశ భవిష్యత్తు గురించి ఆలోచిస్తారని అన్నారు. అన్ని వర్గాల ప్రజల బాగు కోసం సంక్షేమ పథకాలను అమలు చేయడం జరిగిందన్నారు కంగనా రనౌత్.