దేవుడిగా భావిస్తున్న మోడీ – సీఎం
నిప్పులు చెరిగిన అరవింద్ కేజ్రీవాల్
న్యూఢిల్లీ – ఆప్ చీఫ్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. మోడీ తనను తాను దేవుడిగా భావిస్తున్నారని ఎద్దేవా చేశారు. భగవంతుడి అవతారమని అనుకోవడం దారుణమన్నారు.
తాను ఈ సందర్బంగా ఆర్ఎస్ఎస్ ను అడుగుతున్నానని, వారు కూడా ఈ దేవుడిని నమ్ముతారా అని ప్రశ్నించారు అరవింద్ కేజ్రీవాల్. దేశానికి ఏం జవాబు చెబుతారో చెప్పాలన్నారు. విచిత్రం ఏమిటంటే 400 సీట్లు వస్తాయని ప్రధానమంత్రి చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు సీఎం.
543 సీట్లకు గాను అన్ని సీట్లు ఎలా వస్తాయని ప్రశ్నించారు. ప్రజలు మోడీని నమ్మడం లేదన్నారు. మూకుమ్మడిగా ప్రతిపక్షాలతో కూడిన భారత కూటమి విజయం సాధించడం తప్పదని జోష్యం చెప్పారు అరవింద్ కేజ్రీవాల్.
దేశాన్ని భ్రష్టు పట్టించిన ఘనత ప్రధానికే దక్కుతుందన్నారు. అన్ని వ్యవస్థలను సర్వ నాశనం చేశాడని, విద్యా, ఆరోగ్య రంగాలను పట్టించు కోలేదన్నారు.