గాడి తప్పిన మోడీ పాలన
ప్రచారం తప్ప పనులేవి
ఒడిశా – ఏఐసీసీ మాజీ చీఫ్ రాహుల్ గాంధీ కీలక వ్యాఖ్యలు చేశారు. ఏడవ విడత ఎన్నికల ప్రచారంలో భాగంగా గురువారం ఆయన ఒడిశా రాష్ట్రంలోని బాలా సోర్ లో జరిగిన బహిరంగ సభలో ప్రసంగించారు. ఈ సందర్బంగా కీలక వ్యాఖ్యలు చేశారు. మోడీ అరాచక పాలన సాగిస్తున్నారంటూ ధ్వజమెత్తారు.
ఆయన తన వ్యక్తిగత ప్రచారంపై పెట్టిన ఫోకస్ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై దృష్టి సారించడం లేదంటూ మండిపడ్డారు. ఇలాంటి వ్యక్తి మరోసారి పీఎంగా ఎన్నికైతే ఇక దేశం మొత్తాన్ని గంప గుత్తగా అమ్మకానికి పెట్టేస్తాడంటూ సంచలన ఆరోపణలు చేశారు.
ఉన్న ప్రభుత్వ రంగ సంస్థలను సర్వ నాశనం చేసింది చాలక ఆదాయ బాట పట్టిన సంస్థలను కూడా బడా బాబులకు కట్ట బెట్టాడని మండిపడ్డారు. ఇవాళ గతంలో లేని విధంగా నిరుద్యోగం, ద్రవ్యోల్బణం పెరిగి పోయిందని వీటి గురించి పల్లెత్తు మాట కూడా మాట్లాడక పోవడం దారుణమన్నారు.
కులం పేరుతో, మతం పేరుతో రాజకీయాలు చేస్తూ ఓటు బ్యాంక్ రాజకీయాలకు పాల్పడుతున్న మోడీకి గుణ పాఠం చెప్పాలని పిలుపునిచ్చారు రాహుల్ గాంధీ.