నింగి లోకి అగ్ని బాణ్
దూసుకు వెళ్లిన ప్రైవేట్ రాకెట్
శ్రీహరికోట – ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని శ్రీహరి కోట మరో చరిత్రకు నాంది పలికింది. ప్రైవేట్ గా తయారు చేసిన రాకెట్ అగ్ని బాణ్ ను గురువారం విజయవంతంగా ప్రయోగించింది. ఈ రాకెట్ నింగి లోకి దూసుకు వెళ్లింది.
ఈ ప్రైవేట్ రాకెట్ ను ప్రయోగించడం ఇది తొలిసారి కాదు. ఇది వరుసగా 5వ ప్రయత్నం . చివరకు ఎట్టకేలకు విజయంతం కావడంతో శాస్త్రవేత్తలు, ఇస్రో సంబురాలలో మునిగి పోయింది. ఇదిలా ఉండగా దేశంలోనే తొలి సెమీ క్రయోజనిక్ ఇంజిన్ ఆధారిత రాకెట్ కావడం విశేషం.
దీనిని అగ్ని కుల్ కాస్మోస్ అనే ప్రైవేట్ కు చెందిన స్టార్టప్ సంస్థ తయారు చేసింది. దీనికి అగ్ని బాణ్ అని రాకెట్ కు పేరు పెట్టింది. ఇక భవిష్యత్తులో చిన్న తరహా ఉప గ్రహాలను లో ఎర్త్ ఆర్బిట్ (కక్ష్య)లోకి ప్రవేశ పెట్టేందుకు గాను ఇస్రో దీనిని ప్రయోగించింది.
రాబోయే రోజుల్లో ఇలాంటి ప్రైవేట్ రాకెట్ లు ఇంకెన్ని ప్రయోగిస్తుందో వేచి చూడాలి. ప్రైవేట్ రాకెట్ అగ్ని బాణ్ రాకెట్ ను విజయంతంగా ప్రయోగించినందుకు దేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ప్రత్యేక అభినందనలు తెలిపారు.