NEWSNATIONAL

మోడీపై మ‌న్మోహ‌న్ సింగ్ ఫైర్

Share it with your family & friends

విద్వేష పూరిత ప‌దాలు వాడొద్దు

న్యూఢిల్లీ – భార‌త దేశ మాజీ ప్ర‌ధాన‌మంత్రి మ‌న్మోహ‌న్ సింగ్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. గ‌తంలో ఈ దేశంలో ఏ ప్ర‌ధాన‌మంత్రి ఇలాంటి ద్వేష పూరిత , అన్ పార్ల‌మెంట‌రీ ప‌దాలు మాట్లాడ‌డం లేద‌ని ఆరోపించారు. ఇది ఎంత మాత్రం మంచి ప‌ద్ద‌తి కాద‌న్నారు.

ప్ర‌జా ప్ర‌సంగాల‌కు సంబంధించిన గౌర‌వాన్ని త‌గ్గించిన తొలి ముఖ్య‌మంత్రి మోడీ అంటూ ఆవేద‌న వ్య‌క్తం చేశారు. మోడీ పూర్తిగా విభ‌జ‌న స్వభావంతో కూడిన అత్యంత దుర్మార్గ‌పు విద్వేష పూరిత ప్ర‌సంగాల‌కు శ్రీ‌కారం చుట్టిన ఘ‌న‌త ప్ర‌స్తుత పీఎంకు ద‌క్కుతుంద‌న్నారు.

తాను పీఎంగా ఉన్న స‌మ‌యంలో ఒక స‌మాజం నుండి మ‌రో వ‌ర్గాన్ని ఎన్న‌డూ వేరు చేసిన ప్ర‌య‌త్నం చేయ‌లేద‌ని స్ప‌ష్టం చేశారు డాక్ట‌ర్ మ‌న్మోహ‌న్ సింగ్. అయితే దేశానికి చెందిన వ‌న‌రుల‌పై తొలి హ‌క్కు ముస్లింల‌దేన‌ని తాను చెప్పిన‌ట్టు ప‌దే ప‌దే మోడీ ప్ర‌స్తావించ‌డాన్ని తప్పు ప‌ట్టారు.

ఇక‌నైనా విద్వేష పూరిత ప్ర‌సంగాల‌కు పుల్ స్టాప్ పెడితే మంచిద‌ని సూచించారు . ప్ర‌స్తుతం మాజీ సీఎం ప్ర‌స్తుత ప్ర‌ధాని ప‌ట్ల చేసిన కామెంట్స్ క‌ల‌క‌లం రేపుతున్నాయి.