నా ఆరోగ్యంపై విచారణ అవసరమా
ప్రధాని మోడీపై సీఎం నవీన్ ఫైర్
ఒడిశా – ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తన ఆరోగ్యం గురించి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ స్పందించడాన్ని తప్పు పట్టారు. ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న పీఎం తన ఆరోగ్యం పై విచారణకు ఆదేశిస్తానని చెప్పడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు.
ఒక బాధ్యత కలిగిన పదవిలో ఉన్న మోడీ ఇలాంటి చవకబారు వ్యాఖ్యలు చేస్తాడని అనుకోలేదన్నారు. ఆయనకు తన స్థాయికి మించి మాట్లాడుతున్నాడని, ఇది మంచి పద్దతి కాదన్నారు. రాజకీయాలలో గెలుపు ఓటములు , పొత్తులు , ఆరోపణలు, విమర్శలు సర్వ సాధారణమని పేర్కొన్నారు.
గత 10 ఏళ్లుగా ఒడిశా రాష్ట్రాన్ని పాలిస్తూ వస్తున్నానని, తన ఆరోగ్యానికి ఢోకా లేదన్నారు సీఎం నవీన్ పట్నాయక్. కొందరు చేస్తున్న అబద్దపు ప్రచారాన్ని నమ్మవద్దని కోరారు . గురువారం ఆయన ప్రముఖ జాతీయ ఛానెల్ ఏఎన్ఐ చీఫ్ ఎడిటర్ స్మితా ప్రకాశ్ తో సంభాషించారు. ఈ సందర్బంగా ఆమె అడిగిన ప్రశ్నలకు తడుము కోకుండా ఆన్సర్ ఇచ్చారు. మొత్తంగా నవీన్ పట్నాయక్ చేసిన కామెంట్స్ మోడీని ఇరకాటంలో పడేసేలా చేశాయి.